విజయంలో అబ్బాయితో అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో జె.జె. సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకంపై శ్రీనివాస్, వందనా అలేఖ్య నిర్మించిన అబ్బాయితో అమ్మాయి చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ- జనవరి 1న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో నడుస్తోంది.
ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ- ఈ ఏడాది నాకు దర్శకుడు రమేష్ వర్మ మంచి సక్సెస్‌ని ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.
హీరోయిన్ పలక్ లల్వాని మాట్లాడుతూ- ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నాగశౌర్య కెరీర్‌లో మంచి కలెక్షన్లు రాబడుతున్న చిత్రంగా నిలిచింది అన్నారు.