అరబిక్ పాటతో గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా గల్ఫ్ వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై ఎక్కలి రవీంద్రబాబు, ఎం.రమణికుమారి నిర్మిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలియజేస్తూ- ‘ఇలాంటి నేపథ్యంలో తెలుగులో సినిమా రాలేదు. అనేక గల్ఫ్ వలసల జీవితాల యధార్థ గాథలను పరిశీలించి, పరిశోధించి ఈ స్క్రిప్ట్‌ను తయారుచేశాం. ఫిలింసిటీ, హైదరాబాద్ పరిసరాలు, గల్ఫ్ దేశంలో చిత్రీకరణ జరిపాం. తెలుగులో తొలిసారిగా అరబిక్ సాంగ్‌ను ఉపయోగించాం.
సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి అందించిన పాటకి కువైట్‌లో పాపులర్ సింగర్, రైటర్ అయిన అబ్దుల్ లాల్ సాలెం అరబిక్ సాహిత్యాన్ని సమకూర్చి తనే ఆలపించాడు. ఈ పాటను కూడా కువైట్‌లోని ప్రాంకోఅరబ్ రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేశాం. ఆ దేశంలో రికార్డ్ అయిన తొలి తెలుగు సాంగ్ ఇదే. ఈ పాటను పదిమంది డాన్సర్లపై ఇటీవలే చిత్రీకరించాం. తప్పకుండా ప్రతి ఒక్కరినీ కదిలించే చిత్రమిది’ అన్నారు. నిర్మాత రవీంద్రబాబు మాట్లాడుతూ- ‘సునీల్‌కుమార్ తీసిన సొంతవూరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైం కథ చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేస్తామ’ని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు:పులగం చిన్నారాయణ, సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా:ఎస్.వి.శివరాం, సహ నిర్మాతలు:డాక్టర్ ఎల్.ఎన్.రావు, రాజాజీ, దర్శకత్వం:సునీల్ కుమార్ రెడ్డి.