సందేశంతో కారం దోసె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు త్రివిక్రమ్ వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించే చిత్రం ‘కారం దోసె’. జి.శివరామచంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, చందన నాయికా నాయికలుగా నటించారు. దీన్ని వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, జీవితంలో ఏదో చేయాలని కలలు కనే నేటి యువతరం మాటలు తగ్గించి, చేతల్లో చూపించమని చెబుతూ ఈ చిత్రం సాగుతుందని, ఒళ్లు వంచి పనిచేస్తే తనకి, సమాజానికి అది మేలు చేస్తుందని చెప్పేలా చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఆడియోకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినందున డిసెంబర్‌లో విడుదల చేస్తామన్నారు. వంకాయల సత్యనారాయణ, కాశీవిశ్వనాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:సురేష్, కెమెరా:రాజాభట్టాచార్య, సంగీతం:సిద్ధార్థ్ వాట్కిన్స్, పాటలు:శ్రీరామ్, ఆర్.ఆర్:దేవ్‌గురు, నిర్మాతలు:జి.శివరామచంద్ర, దర్శకత్వం:త్రివిక్రమ్.