వేటపాలెం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీ, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో ఎ.వి.ఆర్. నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో బేబి శ్లోక విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చామని, సందేశంతో కూడిన కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ సినిమాకోసం తనకు అందరూ సహకరించారని తెలిపారు. అనాథ పిల్లలకు సరైన ప్రోత్సాహం ఇచ్చేవారు, చెప్పేవారు లేకపోవడంవల్ల వారు నేరస్థులుగా మారుతున్నారని, వారు ఎలాంటి పరిస్థితులలో తమ జీవితాలలో ఎదుర్కొంటున్నారో తెలిపే కథాకథనంతో క్రైమ్ నేపథ్యంలో మనస్సును తాకే సన్నివేశాలతో ఈ చిత్రం సాగుతుందని, సినిమా సంగీతం హైలెట్‌గా ఉంటుందని దర్శకుడు నంది వెంకటరెడ్డి అన్నారు. అనాధ పిల్లలమీద ఓ చిత్రం తీయడం నిర్మాత అభిరుచికి నిదర్శనమని, ఆయన నుండి మంచి చిత్రాలు రావాలని ఎ.ఎం.రెడ్డి కోరుకున్నారు. మంచి పాటలతో రూపొందించిన ఈ చిత్రం విజయవంతవౌతుందని సంగీత దర్శకుడు సన్ని అన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్, శిల్ప చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: డి.యాదగిరి, పాటలు: నర్ల రామకృష్ణారెడ్డి, సంగీతం: ఎ.ఆర్.సన్ని, నిర్మాత: డాక్టర్ ఎ.వి.ఆర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నంది వెంకటరెడ్డి.