అహ్మదాబాద్‌లో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు, దర్శకుడు మురగదాస్‌ల కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో షెడ్యూళ్లు పూర్తిచేసుకుని ఈ రోజు అహ్మదాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ శుక్రవారం మొదలుకానుండగా మహేష్ మాత్రం 27వ తేదీ నుండి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కొన్ని రోజులు పూణెలోనూ షూటింగ్ జరుగుతుందట. మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత లొకేషన్స్ కోసం మురగదస్ అహ్మదాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారస్థాయిలో ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. మహేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే జూన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.