అదృష్టం కలసి రావాలి.... - హీరోయిన్ పూర్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అవును’, ‘సీమటపాకాయ్’ చిత్రాలతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. తాజాగా కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ ఫిలింస్ బ్యానర్‌పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూర్ణ చెప్పిన విశేషాలు...
రాణి పాత్రలో..
ఇందులో రాణి అనే పాత్రను చేశాను. అది నా పర్సనల్ లైఫ్‌కు పూర్తిగా వ్యతిరేకం. నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. రాణి క్యారెక్టర్ అలా కాదు. ఫక్తు పల్లెటూరి అమ్మాయి. పువ్వులను అమితంగా ఇష్టపడుతుంది. నర్సరీ పెంచుతుంది. ఎప్పుడైనా సెట్లో నేను రాణిలాగా కాకుండా పూర్ణలాగా కనిపిస్తే వెంటనే దర్శకుడు నన్ను కంట్రోల్ చేసేవారు. రాణిలాగానే కనిపించమని చెప్పేవారు.
భిన్నమైన సినిమా
ఈ సినిమా నాకు డిఫరెంట్ చిత్రం. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాతో ట్రావెల్ చేస్తున్నాను. యాక్షన్ సినిమాలు చాలా చేశాను. దర్శకుడు శివాజీ ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. శిశువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా ఈ సినిమాలోని ప్రతి విషయాన్ని ఆయన కేర్ తీసుకుని చేశారు. శివాజీతో పనిచేయడం నాకు లెజెండ్‌తో చేసినట్టు అనిపించింది.
గోదారి అందాల్లో..
నేను కేరళ అమ్మాయిని. ప్రపంచంలో ఉన్న పచ్చదనమంతా మా దగ్గరే ఉంటుందనే గర్వం నాకు చాలా ఉండేది. ఈ సినిమా కోసం నేను గోదావరి పరిసరాల్లో ట్రావెల్ చేశాను. ఇంత అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను. వంటలు కూడా చాలా రుచికరంగా అనిపించాయి.
శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశారు
శ్రీనివాసరెడ్డితో ఇంతకుముందే చేయాల్సింది. రెండు సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమాను కూడా చేయొద్దని చాలామంది చెప్పారు. కథ బాగా నచ్చింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా చేశాను. నేనిప్పటివరకు చాలామంది హీరోలతో పనిచేశాను. శ్రీనివాస్‌రెడ్డి సెట్లో చాలా హెల్ప్ చేశారు.
ఆ రెండు నాకు ముఖ్యమే
నేను ముస్లిం అమ్మాయిని అయినా కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఆ డానే్స నన్ను సినిమాలకు చేర్చింది. నటన, డాన్స్ రెండూ ముఖ్యమే. సినిమాల్లో డాన్స్ చేసే అవకాశం వస్తే చాలా ఆనందంగా చేస్తాను కానీ అది ఐటెం సాంగ్ కాకూడదు. శ్రీమంతుడు తర్వాత ఐటెమ్ సాంగ్స్ చేయమని చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నేను అంగీకరించలేదు. నాకు పర్సనల్‌గా వెస్ట్రన్ వేర్ అంటే ఇష్టమే కానీ తెరమీద చీరల్లోనూ, లంగా ఓణీల్లోనూ బావుంటాను. అలాంటప్పుడు వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఎందుకు? ఐటెం సాంగ్స్ చేయడం తప్పు అని నేననడం లేదు. కానీ నాకు ఇష్టం ఉండదు. నేను స్పెషల్ సాంగ్ చేస్తే అది సినిమాలో స్పెషల్‌గా ఉండాలి. అప్పుడే చేస్తాను.
తదుపరి చిత్రాలు
మూడు జనరేషన్లకు సంబంధించిన కథతో ఓ సినిమా చేస్తున్నా. అందులో మూడు పాత్రల్లో కనిపిస్తా. అందులో ఒకటి ముసలి పాత్ర, ఇంకోటి తల్లి, మూడోది మోడర్న్ యువతి పాత్ర.

-శ్రీ