విలువలతో తుహిరే మేరీ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ-‘ఇదొక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది.’అని చెప్పారు. హీరో వికాస్ మాట్లాడుతూ-‘తెలుగులో ఇది నా మొదటి చిత్రం. అందరూ కొత్తవాళ్ళతో కలిసి చేశాం. మంచి పాటలు కుదిరాయి. సినిమాను కొత్తగా తీయడానికి ప్రయత్నించాం. హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు. హీరోయిన్ కళ్యాణి మాట్లాడుతూ-‘ఈ సినిమాలో స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు అన్ని కలగలిపి ఉంటాయి. నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలో నటించా..’ అని చెప్పారు. రైటర్ చాణక్య మాట్లాడుతూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా సినిమాను తీర్చిదిద్దామని, జోడా శాండి మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:జోడా శాండి, ఎడిటింగ్: రాజు లీల, పాటలు:చాణక్య, నిర్మాత:కనవరెడ్డి నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.డి.ఉదయ్‌కుమార్.