నవ్వించే మయసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మయసభ. ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ- ‘ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని సంకల్పించి ఖమ్మం, కృష్ణా జిల్లా మైలవరం, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. ఆద్యంతం కామెడీతో ఈ మయసభ ప్రేక్షకులను ఆలరిస్తుంది అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘దర్శకుడు నెప్పలి కృష్ణ ఈ మూవీని చాలా చక్కగా, అందరినీ నవ్వించే విధంగా తెరకెక్కిస్తున్నాడు. సరికొత్త కామెడీని ప్రేక్షకులు చూస్తారు’ అన్నారు. చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో చింటు, జూ. రేలంగి, షకలక శంకర్, రాఘవ, రమణారెడ్డి, వెంకట్, దేవా, కోటయ్యలు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం:సాకేత్, పాటలు:శ్రీమాన్, కాసర్ల శ్యామ్, కెమెరా:గోపి కాకర్ల, నిర్మాతలు:సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి, కథ, దర్శకత్వం:నెప్పలి కృష్ణ.