రెండో షెడ్యూల్‌లో షీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రల్లో పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మిస్తున్న ‘షి’ చిత్రం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోమవారం లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత తేజేశ్వరరావు మాట్లాడుతూ- అన్నిరకాల కమర్షియల్ అంశాలుండే సినిమా ఇది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. మూడు రోజుల్లో ఈ పాటను పూర్తిచేసి జనవరి 16తో ఈ షెడ్యూల్‌ను పూర్తిచేస్తాం. ఫిబ్రవరికల్లా మిగతా షూటింగ్‌ని చేసి మార్చి నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు రమేష్ మహేంద్ర మాట్లాడుతూ- మన సంస్కృతి, సంప్రదాయాలను బతికించే స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ఈ ప్రేమకథ భయం అనే అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ముఖ్యంగా నిర్మాత సపోర్టు మరువలేనిది అన్నారు. హీరో మహత్ రాఘవేంద్ర మాట్లాడుతూ- చాలా రోజుల తరువాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఇది హర్రర్ సినిమా కాదు. సెంటిమెంట్ వున్న సినిమా అన్నారు. హీరోయిన్ చేతన మాట్లాడుతూ- ఈ సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా వుంది. చాలా మంచి సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:్భలె, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, కెమెరా:అనిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:బసంత్‌రెడ్డి, నిర్మాత:కల్వకుంట్ల తేజేశ్వరరావు, దర్శకత్వం: పర్సా రమేష్ మహేంద్ర.