పూర్ణకు లక్కీచాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి పూర్ణ తాజాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయని అందరూ అభిప్రాయపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది. కానీ, అది తెలుగులో కాదు తమిళంలో. దర్శకుడు నిర్మల కుమార్ త్వరలో డైరెక్ట్ చేస్తున్న ‘శత్రుజ్ఞ వెట్టై-2’ సినిమాలో ఈమె నటుడు అరవిందస్వామికి జంటగా నటిస్తోంది. 2014లో వచ్చిన ‘శత్రుజ్ఞవెట్టై’ సినిమాకి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రాన్ని మనోబాల నిర్మిస్తున్నారు. దీని గురించి పూర్ణ మాట్లాడుతూ- చిన్నప్పటి నుంచి అరవిందస్వామి నా ఫేవరెట్ హీరో. ఎప్పటికైనా ఆయనతో నటించాలని ఉండేది. ఆయన సినిమాలు మానేశారని వినగానే చాలా బాధపడ్డాను. మళ్లీ ఆయన హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో భార్యగా నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. ఇందులో నాది కాస్త డిఫరెంట్ రోల్. ఈ సినిమాలో త్రిష కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.