విదేశాలలో విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. విదేశాలలో షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాట్లాడారు. ఈ నెల 3 నుండి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల చిత్రీకరణ చేశామని, యాంకర్ అనసూయపై మరోపాటను చిత్రీకరించామని తెలిపారు. టర్కీ, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చేశామని, బల్గేరియన్ ఫైటర్స్ పాల్గొన్నారని తెలిపారు. వచ్చే నెల 6 నుండి 22 రోజులపాటు ఊటీ, బెంగుళూరులో మరో షెడ్యూల్ చేస్తామని తెలిపారు. జనవరిలో మిగతా టాకీపార్ట్, మరో రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమాలో కథనమని, తమన్ ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయని వారు తెలిపారు. జగపతిబాబు, ముకేష్ రుషి, అలి, వెనె్నల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:చోటా కె నాయుడు, సంగీతం:తమన్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, కథ:వెలిగొండ శ్రీనివాస్, మాటలు:అబ్బూరి రవి, శ్రీ్ధర్ శీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.