అందుకే జయం నిశ్చయమైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా ఎస్.ఆర్.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై శివరాజు కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దర్శక,నిర్మాత శివరాజ్ కనుమూరి ఈ విజయాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
స్పందన బాగుంది
ఈ సినిమా విడుదలన రోజున ఆడియన్స్‌తో కూర్చుని చూశాను. వారి రెస్పాన్స్ చూసి చాలా థ్రిల్ అయ్యాను. ఎక్కడ చూసినా అందరూ బాగుందని అంటున్నారు. కొద్దిగా స్లోగా ఉందని టాక్ రావడంతో 15 నిమిషాల నిడివి తగ్గించాం. ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కొత్త ఇంపాక్ట్ కలుగుతుంది.
శ్రీనివాసరెడ్డితోనే..
ఈ కథ అనుకున్నప్పుడు ముందుగా కొత్తవాళ్లతో చేద్దామనుకున్నాను. ఒక పెద్దాయన సలహాతో తెలిసిన హీరో అయితే బాగుంటుందనిపించింది. ముప్పయ్యేళ్లయినా తను అనుకున్న ఉద్యోగం సంపాదించకుండా జీవితంలో నిరాశతో ఉన్న ఓ యువకుడి కథ ఇది. కాబట్టి అతన్ని చూడగానే ప్రేక్షకులకు జాలి కలిగేలా ఉండాలి.
ఈ పాత్రకు శ్రీనివాసరెడ్డి అయితేనే కరెక్ట్ అనిపించింది. ఆయన నటించిన గీతాంజలి సినిమా మంచి సక్సెస్‌తోపాటు తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాత్రకు సరైన న్యాయం చేశాడు. మన పక్కింటి అబ్బాయిలా కనిపించాడని అందరూ అంటున్నారు. ఇక హీరోయిన్ పూర్ణ కూడా తన పాత్రలో జీవించింది.
వర్మ స్కూల్లో
మాది తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు దగ్గర మట్టపల్లి. ఎమ్మెస్సీ పూర్తిచేశాను. సినిమాలంటే చిన్నప్పటినుంచి ఆసక్తి. రామ్‌గోపాల్ వర్మ తీసిన సత్య చూశాక- ఓ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఆయన దగ్గర పనిచేశాను. జె.డి.చక్రవర్తి దగ్గర కూడా అసోసియేట్‌గా పనిచేశాను.
దేశవాళీ వినోదం
కరీంనగర్‌కు చెందిన కుర్రాడు కాకినాడకు ఉద్యోగ రీత్యా వెళతాడు. అక్కడ నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే కథతో సాగే ఈ సినిమాలో నేచురల్ కామెడీ ఉంటుంది.
ఆయా ప్రాంతాల్లో ఉండే భాష, వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు పక్కాగా చూ పించాం కాబట్టి దేశవాళీ వినోదం అని అ న్నాం. ముఖ్యంగా ఈ కథ 2013 ప్రాంతంలో జరుగుతుంది. దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకున్నాం.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి కథలైతే ఉన్నాయి. తరువాతి సినిమా ఎవరితో అనేది త్వరలోనే చెబుతాను. ఈ సినిమాతో దర్శకుడిగానే కాక నిర్మాతగా మారాను.

-శ్రీ