పిజ్జా-2 పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి.సినీ క్రియేషన్స్ పతాకాలపై పిజ్జా-2 పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డి.వెంకటేష్. ఈ చిత్రంలోని పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలైన సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, మల్కాపురం శివకుమార్, జె.శివకుమార్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘పిజ్జా చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో రూపొంది ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత చాలా హారర్ సినిమాలు వచ్చాయి. తెలుగులో వస్తున్న ఈ చిత్రం కూడా తప్పకుండా ఘన విజయం సాధించాలి’ అన్నారు. నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ,‘ ట్రైలర్ బాగుంది. పాటలు రొమాంటిక్‌గా ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. హీరోయిన్ గాయత్రి మాట్లాడుతూ,‘తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక్కడికి వచ్చిపోవడం వల్ల తెలుగు నేర్చుకున్నాను. నా కెరీర్‌లో ఈ సినిమా చాలా ప్రత్యేకం. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయమవడం ఆనందంగా వుంది’ అన్నారు. నిర్మాత జె.ఎస్.కె మాట్లాడుతూ,‘తమిళంలో ఘన విజయం సాధించిన సినిమాను నిర్మాత వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మంచి సినిమాలు ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. తప్పకుండా ఓ తెలుగు సినిమా తీస్తాను’ అన్నారు. దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఇది విజయం సాధిస్తుందన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ,‘ఈమధ్య సౌత్‌లో చాలా హారర్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఇది డిఫరెంట్ జోనర్. పిజ్జాను మించిన థ్రిల్ ఈ సినిమాతో ప్రేక్షకులకు కలుగుతుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సి.ఎస్, మంత్ర ఆనంద్, ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్, కెమెరా: దినేష్ కృష్ణన్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: రంజిత్ జయకోడి.