పోకిరి రాజా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, హన్సిక జంటగా సెల్వకుమార్ సమర్పణలో రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉసిరికల హనీప్రమోద్, పి.శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పోకిరిరాజా. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్నామని, జీవా నటన, హన్సిక గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారని తెలిపారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో రొమాన్స్ ఆకట్టుకుంటుందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ డి.ఇమాన్ అందించారన్నారు.
రామ్‌దాస్, మనోబాల, మెయిల్ సామి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అంజి, ఎడిటింగ్: వి.జె.సాబుజోసెఫ్, సంగీతం: డి.ఇమామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ప్రకాష్ రాయప్ప.