శరవేగంగా గౌతమీపుత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- తెలుగుజాతి గొప్పదనాన్ని చాటిచెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రపై సినిమా చేయడం ఓ సవాలు లాంటిదని, 33 భాగాలుగా వున్న భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన తెలుగు చక్రవర్తి కథ ప్రేక్షకులకు ఆనందాన్నిస్తుందని, బాలకృష్ణ వందో సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించడం అభిమానులకు పండుగలా వుందని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, షూటింగ్ పూర్తిచేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటుగా రీరికార్డింగ్ కార్యక్రమాలు, సిజి వర్క్స్ లాంటివన్నీ చేస్తున్నామని తెలిపారు. మొరాకోలో షూటింగ్ పూర్తికాగానే జూన్, జూలైలోనే సిజి వర్క్ మొదలుపెట్టామని, డిసెంబర్ చివరివారంలో సెన్సార్‌కు పంపించనున్నామని తెలిపారు. 2 గంటల 12 నిమిషాలపాటు సాగే ఈ చిత్రాన్ని 79 రోజుల్లో పూర్తిచేశామని, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ అంచనాలు అందుకుంటామని ఆయన అన్నారు. జార్జియా, మొరాకో, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చేసిన షూటింగ్ అద్భుతంగా వచ్చిందని ఆయన వివరించారు.