సర్వేష్‌గా మంగళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వమంగళం అనే పిరికివాడు క్రమంగా ధైర్యాన్ని కూడకట్టుకొని సర్వేష్‌గా ఎలా మారాడు అన్న అంశంతో రూపొందిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందని దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎస్‌ఆర్‌ఎఫ్ పతాకంపై సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు సినిమా విశేషాలు తెలిపారు. కరీంనగర్ గీతాభవన్ కాఫీలా, కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలా ఈ సినిమా ప్రేక్షకులకు పసందైన చిత్రంగా నచ్చుతుందని, కుటుంబ సభ్యులతోపాటుగా యువతకు ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రవివర్మ, కృష్ణ్భగవాన్, కృష్ణుడు, మీనా, స్పందన, కార్తిక్‌రోడ్రిగ్జ్, సుబ్బరాజు, గుర్రం రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రవివర్మ, ఎ.వి.ఎస్.రాజు, రాజసింహ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.