చరణ్‌కు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమా ఈనెల విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత ఆయన నటించే సినిమాపై క్లారిటీ వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని, ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు, ప్రీపొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన ఎవరు నటించనున్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, మొదట రాశీఖన్నాను ఎంపిక చేస్తారని వినిపించింది. పల్లెటూరు నేపథ్యంలో రూపొందే కథ అవ్వడంతో, 80వ దశకంలో జరిగిన నేపథ్యంతో కథ వుంది కనుక మంచి ఫీల్ వుండేలా జోడీ కుదరాలని దర్శకుడు సుకుమార్ చాలామంది హీరోయిన్లను అనుకుని చివరికి గ్లామర్ భామ సమంతను ఫిక్స్ చేశాడట. రామ్‌చరణ్ సరసన సమంత అంటే ఓ క్రేజ్ ప్రొడక్ట్‌గా వుండనుందని అంచనాలు. ఈ జోడీ బాగుంటుందని సుకుమార్ కూడా ఖరారు చేసే దిశలోనే ఉన్నాడట.