హారర్ థ్రిల్లర్‌గా త్రివిక్రమన్ దర్శకుడు క్రాంతికుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ, నాగబాబు, రవిబాబు, అమూల్యారెడ్టి ప్రధాన తారాగణంగా క్రాంతికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం త్రివిక్రమన్. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు, నిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ- కథ కథనాలు కొత్తగా వుండడంతోపాటుగా వాటిని సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించామని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటుందని తెలిపారు. ఆద్యంతం వినోదం పంచుతూ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, శ్రీ నటించిన పాత్ర సరికొత్తగా వుంటుందని తెలిపారు. ఈ సినిమాను ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో మధురా శ్రీ్ధర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తోటకూర రామకృష్ణారావు, డిస్కో సుచిత్రం, ఓలే, శ్యామ్‌సుందర్, పి.హర్షవర్థన్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. నేహా దేశ్‌పాండే, చంటి, నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:చెరుకుబత్తుల, కెమెరా:నాగార్జున, సునీల్‌బాబు, ఎడిటింగ్:సునీల్ మహారాణా, సంగీతం: రుంకీ గోస్వామి, నిర్మాణం, దర్శకత్వం:క్రాంతికుమార్.