మూడు తరాల హీరోల ముద్దుగుమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పరిశ్రమలో హీరోలకు ఎక్కడ ఫుల్‌స్టాప్ ఉండదు, అన్నీ కామాలే. వరుసగా హిట్ సినిమాలు పడ్డాయంటే.. చాలు టాప్ హీరోగా నిలబడిపోతాడు, లేదా వరుసగా ఫ్లాప్‌లు వచ్చాయో.. వెనకబడిపోతాడు అంతే తేడా. కానీ హీరోయిన్ విషయంలో అలా కాదు. టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్నా కూడా నాలుగైదు సంవత్సరాలే.. లేదంటే ఓ దశాబ్దంపాటు హీరోయిన్‌గా వెలుగొందుతుంది.. అందుకే అన్ని భాషా చిత్రపరిశ్రమల్లో హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువగానే ఉంటుంది. కొత్త కొత్త కథానాయికల ఎంట్రీతో పరిశ్రమ ఎప్పుడు కొత్త అందాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక హీరోయిన్స్ కూడా వరుసగా అందరు హీరోలతో నటించేయాలనే ప్లాన్‌లో ఉంటారు. అందుకే హీరో అయిన వారసులు ఎవరైనా సరే వాళ్ళ సరసన నటించేందుకు రెడీ అంటారు. అప్పట్లో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లతో నటించిన హీరోయిన్స్ ఆ తరువాత బాలకృష్ణ, నాగార్జునలతో నటించిన దాఖలాలు ఉన్నాయి. ఇక లేటెస్టుగా నేటి తరం కథానాయికలు అటు యువ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో నటిస్తూ.. సత్తా చాటుతున్నారు. ఒకేసారి మూడు తరాల కథానాయకులతో నటిస్తూ హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు తరాల కథానాయకులతో నటించేస్తున్నారు. ఇలా కథానాయికల్ని పంచుకోవడం.. టాలీవుడ్‌లో అన్ని ఫ్యామిలీల కథానాయకుల్లోనూ కనిపిస్తంది. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు మూడు తరాల కథానాయకులతో నటిస్తూ నేటి హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి హీరోయిన్స్ ఎవరు.. ఏమా కథ చూద్దామా..
ఈ విషయంలో అందరికన్నా గ్లామర్ భామ కాజల్ ముందుంది. ఒకే ఫ్యామిలీలోని రెండు తరాల కథానాయకులు ఎక్కువమందితో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని రెండు తరాల స్టార్ కథానాయకులు అందరితోనూ నటించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కాజల్ మొదట రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి సినిమాల్లో రొమాంటిక్‌గా ఆడిపాడింది. ఆ తరువాత అల్లు అర్జున్‌తో ‘ఆర్య-2’లో నటించింది. ఆ తరువాత పవన్‌కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో నటించిన విషయం తెలిసిందే. వరుసగా మెగా ఫ్యామిలీలోని రెండో తరం కథానాయకులతో గ్లామర్ ఒలకబోసిన కాజల్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ముఖ్యుడైన చిరంజీవి సరసన కూడా నటిస్తోంది. చిరంజీవి 150వ సినిమాగా ఖైదీ నెం.150లో మెగాస్టెప్పులేసింది. ఇక కాజల్ తరువాత ఆ లిస్టులో చేరింది మిల్కీ భామ తమన్నా. ఆమె కూడా ఒకే ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన ఎక్కువమంది కథానాయకులతో రొమాన్స్ చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని స్టార్ కథానాయకులు ఎక్కువమందితో నటించిన నాయికగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. పవన్‌కళ్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో పవన్ సరసన ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా, అదే ఫ్యామిలీలోని మరో కథానాయకుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’లో రొమాన్స్ చేసి డాన్సుల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. ఆతరువాత అల్లు అర్జున్‌తో బద్రీనాధ్‌లో అదరగొట్టింది. ఇంకా ఛాన్స్ వస్తే మెగాస్టార్‌తో కూడా నటించే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే అక్కినేని నాగచైతన్య, ఎన్టీఆర్‌లతో నటించిన ఈమె, వీలైతే నాగ్, బాలయ్యలతో నటించేందుకు ఓకే చెప్పొచ్చు. ఈ లిస్టులో చేరింది మరో ముద్దుగుమ్మ శ్రుతిహాసన్. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా ‘గబ్బర్‌సింగ్’. పవన్‌కళ్యాణ్ సరసన నటించిన ఈ అమ్మడు ఆ సినిమా సూపర్‌హిట్టవ్వడంతో లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత శ్రుతి నటించిన మరో మెగా కథానాయకుడు రామ్‌చరణ్. అతడితో ‘ఎవడు’లో నటించిన శ్రుతిహాసన్ ఆ సినిమాని కూడా బ్లాక్‌బస్టర్ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’లో నటించిన ఆ సినిమాని కూడా బ్లాక్‌బస్టర్‌గా మలిచింది. మొత్తంమీద ఆమె మెగా ప్యామిలీ కథానాయకుల పాలిట లక్కీ కథానాయికగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆమె మళ్లీ పవన్ సరసన ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తోంది.
వీళ్ళదారిలోనే ఫాలో అయింది గ్లామర్ భామ ఇలియానా... మెగా ఫ్యామిలిలోని ఇద్దరు కథానాయకులతో చిందేసింది. పవర్‌స్టార్‌తో ‘జల్సా’ సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఇలియానాకు పవర్‌స్టార్‌తో కెమిస్ట్రీ అదిరింది. ఆ తరువాత ఇలియానా నటించిన మరో మెగా కథానాయకుడు అల్లు అర్జున్. బన్నీతో కలిసి ‘జులాయి’లో ఓ రేంజ్‌లో రొమాన్స్ ఒలికించి సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణమైంది. తాజాగా ఇద్దరు మెగా కథానాయకుల సరసన చిందేసిన మరో గ్లామరస్ కథానాయిక సమంత. ‘అత్తారింటికి దారేది’లో పవర్‌స్టార్‌తో ఆడిపాడిన సమంత, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో బన్నీ సరసన చిందేసింది. దాదాపు దశాబ్దకాలంపైగా టాప్ హీరోయిన్‌గా వెలిగిన త్రిష కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే నెంబర్‌వన్ తారామణిగా చెలామణి అయింది. టాలీవుడ్‌లో వున్న దాదాపు అందరు స్టార్ కథానాయకుల సరసన చిందేసిన త్రిష, కోలీవుడ్‌లో కూడా వరుసగా స్టార్ కథానాయకులతో నటించింది. ‘దమ్ము’లో జూనియర్ ఎన్టీఆర్‌తో ఆడిపాడిన త్రిష, ఎన్టీఆర్ ఫ్యామిలీలోని మొదటి తరం కథానాయకుడు బాలకృష్ణతో ‘లయన్’ మూవీలో నటించి ఆకట్టుకుంది. ఇటు అబ్బాయ్, అటు బాబాయతో నటించి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే పవన్‌కళ్యాణ్, చిరంజీవిలతో నటించింది త్రిష. ఇక మరో క్రేజీ హీరోయిన్ శ్రీయ కూడా టాప్ మోస్ట్ కథానాయకులందరి సరసన చిందేసిన అమ్మడు బాలయ్యతో ‘చెన్నకేశవరెడ్డి’లో నటించి, ఆ తరువాత శ్రీయా నందమూరి ఫ్యామిలీలో మూడోతరం కథానాయకుడు ఎన్టీఆర్ సరసన నా అల్లుడులో కూడా బాగానే అందాలు ఆరబోసింది. తాజాగా శ్రీయ మరోసారి బాలయ్య సరసన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మహారాణిగా నటిస్తోంది. ఇటు బాబాయ్‌తోనూ అటు అబ్బాయ్‌తోనూ ఒకే స్టైల్‌లో అందాలు ఆరబోసి ఇప్పటికీ కథానాయికగా మంచి ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. నయనతార కూడా ఇదే లిస్టులో ఉంది.
నందమూరి ఫ్యామిలీలో రెండు తరాల కథానాయకులతో నటించి రికార్డు సృష్టించింది. ముందుగా నందమూరి బాలకృష్ణతో ‘సింహ’లో నాయికగా నటించిన నయనతార, ఆ తరువాత బాలయ్యతోనే ‘శ్రీరామరాజ్యం’లో కూడా నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఆ తరువాత నందమూరి ఫ్యామిలీలోని మూడో తరం కథానాయకుడు ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’లో నటించి ఆకట్టుకుంది. వీళ్ళ తరువాత నయనతార దగ్గుబాటి ఫ్యామిలీలో మొదటి తరం కథానాయకుడు వెంకటేష్‌తో ‘లక్ష్మి’, ‘తులసి’, ‘బాబు బంగారం’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న ఈమె, అదే ఫ్యామిలీలో రెండో తరం కథానాయకుడు అయిన రానాతో ‘కృష్ణం వందే జగద్గురుం’లో కూడా నటించి గ్లామరస్ క్వీన్ అనిపించుకుంది. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో రెండు తరాల కథానాయకులతో నటించిన మరోనాయిక అనుష్క. వెంకీతో ‘చింతకాయల రవి’లో అదరగొట్టే గ్లామర్‌తో జనాన్ని ఊపేసింది అనుష్క. రెండో తరం కథానాయకుడు అయిన రానాతో ‘రుద్రమదేవి’లో ఆడిపాడింది. మొత్తంగా రెండు, మూడు తరాల నాయకులతో ఆడిపాడి ఆకట్టుకుంటున్న ఈ భామలు సంచలనం రేపారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!

-శ్రీ