మహేష్ పోరాటం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన షూటింగ్ అహ్మదాబాద్‌లో జోరుగా సాగుతోంది. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకుముందే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసి ఇప్పుడు అహ్మదాబాద్ షెడ్యూల్‌తో 80 శాతానికిపైగా సినిమాను పూర్తిచేశారు. పరిశ్రమ వర్గాలలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు. అహ్మదాబాద్‌లో మరో 25 రోజులపాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత టీమ్ మొత్తం పాటల చిత్రీకరణకు యూరప్ వెళ్లనున్నారట. మొత్తానికి అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ సంచలనం రేపుతున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. వీరిద్దరి జంట మహేష్ అభిమానులకు కనువిందు చేయనుంది.