బేతాళుడి కాసులవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని మరోసారి ‘బేతాళుడు’గా కలెక్షన్ల వేటను మొదలెట్టాడు. ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటు పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ వున్నదని, 500 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైందని, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ప్రదీప్, ఎస్.వేణుగోపాల్ తెలిపారు. సినిమా విడుదలకుముందు సైతాన్ హార్స్ ఫర్ జయలక్ష్మి అంటూ విడుదల చేసిన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిందని, ఈ వీడియో దాదాపు పది నిమిషాలపాటు సాగి వేట మొదలుపెట్టినట్లు అయిందని వారు తెలిపారు. మార్నింగ్‌షోతోనే పాజిటివ్ వౌత్ టాక్ వచ్చిందని, విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే ఓ వైవిధ్యమైన సినిమాగా రూపొందిందని అన్నారు. రీరికార్డింగ్ అద్భుతంగా సాగిందని, ఎంచుకున్న కథాంశంలో గమ్మత్తయిన మలుపులు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయని, టీజర్‌ను కన్నార్పకుండా ఎలా చూశారో, సినిమాను కూడా అలాగే చూస్తున్నారని, తొలిరోజే బాక్సాఫీస్‌కు కలెక్షన్ల కిక్ వచ్చిందని తెలిపారు. కరెన్సీ క్రైసిస్‌లో కూడా సినిమా రేంజ్ భారీగా వుందని టాక్ రావడం ఆనందాన్నిస్దోందని, కొత్తదనం అన్న పదానికి విజయ్ ఆంటోని ఓ చిరునామాగా కనిపిస్తున్నారని వారు తెలిపారు.