రెండు భాషల్లో చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తమిళ భాషల్లో అంజలి ప్రధాన పాత్రలో హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ సినిమాగా రూపొందిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా రూపొందిస్తున్నామని తెలిపారు. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ప్రేక్షకులకు షాక్ ఇస్తాయని, అంజలి పాడిన పాట సినిమాకు హైలెట్‌గా వుంటుందని వారు తెలిపారు. ఇప్పటివరకూ అంజలి తన కెరీర్‌లో చేయని విభిన్నమైన పాత్రను ‘చిత్రాంగద’లో చేసిందని, ఆమె అభినయం సినిమాకు హైలెట్‌గా వుంటుందని తెలిపారు. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? ఆమెకు ఎదురైన సవాళ్లను ఎలా చక్కదిద్దింది అన్నదే సినిమా కథనమని, అంజలి కెరీర్‌లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందించామని వారు తెలిపారు. కథానుగుణంగా అమెరికాలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని, ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. జె.పి, సప్తగిరి, రాజా రవీంద్ర, సింధూ తులాని, రక్ష, దీపక్, సాక్షీగులాటీ, సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సెల్వగణేశ్, స్వామినాధన్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, జేమ్స్‌స్వామ్, రోహిణ్, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:అశోక్.జి.