గోవాలో చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంకా కీలక పాత్రలో బేబి ఇలినాపార్థవి ప్రధాన తారాగణంగా కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘చిన్నారి’. లోహిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- తల్లీ కూతుళ్ళ సెంటిమెంట్‌తో, హారర్ జోనర్‌లో వైవిధ్యంగా ఈ సినిమాను రూపొందించామని, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని, చూసినవారందరూ స్టైలిష్‌గా, గ్రిట్టింగ్‌గా వుందని చెబుతున్నారు అని తెలిపారు. హారర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇస్తుందని, సినిమా అంతా గోవా నేపథ్యంలో జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. షూటింగ్‌తోపాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, హాలీవుడ్ స్టైల్ మేకింగ్ సినిమాకు ప్లస్‌పాయింట్ కాగలదని వారు తెలిపారు. ఐశ్వర్య, మధుసూదన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అజినీష్ లోక్‌నాధ్, కెమెరా:వేణు, నిర్మాతలు:కె.రవికుమార్, ఎం.ఎం.ఆర్, దర్శకత్వం:లోహిత్.