దెయ్యం అంటే భయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి సురేష్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’ చిత్రాలు తమ కలయికలో వచ్చాయని, ఈ సినిమా కూడా మరో హిట్‌గా నిలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని తెలిపారు. హారర్ మిక్స్ అయిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటన హైలెట్‌గా వుంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందిందని తెలిపారు. కుటుంబమంతా కలిసి ఆనందించే విధంగా దర్శకుడు హారర్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించారని, మరో హిట్ సినిమాగా తమ సంస్థకు పేరు తెస్తుందని నిర్మాత అన్నారు. నాగేశ్వర్ రెడ్డితో చేసిన రెండు సూపర్‌హిట్ సినిమాల నేపథ్యం తరువాత ఈ సినిమా వస్తుందని, ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలకు భిన్నమైన సబ్జెక్టుగా వుంటుందని, తనకు చాలా నచ్చి ఈ సినిమా చేశానని అల్లరి నరేష్ తెలిపారు. సినిమా చూసే ప్రేక్షకులకు వందశాతం వినోదం గ్యారంటీగా దొరుకుతుందని ఆయన తెలిపారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో కృతిక, వౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మట్ చంద్ర, చలపతిరావు, కాందబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు:రత్నంబాబు, పాటలు:్భస్కరభట్ల, నిర్మాత:బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి.