భయపెట్టే ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రద్ధాదాస్, మాధురీ ఇటాజి ప్రధాన తారాగణంగా వేగా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజ్‌కుమార్.జి.ఆర్. దర్శకత్వంలో విక్రంరాజు రూపొందించిన చిత్రం ‘ఆట’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలాగా కాకుండా రియలిస్టిక్‌గా సాగుతుందని, శ్రద్ధాదాస్, మాధురీ ఇటాజి, గాయత్రిల గ్లామర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. గ్లామర్‌తోపాటుగా హారర్‌ను సమపాళ్ళలో వేళవించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించామని, కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగిన విధంగా వుంటుందని తెలిపారు. హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్త స్క్రీన్‌ప్లేతో చిత్రీకరించామని, క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నామని వారు తెలిపారు. అవినాష్, రాజారవీంద్ర, షాయాజీ షిండే, కాదంబరి జట్వాని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వి.రవికుమార్, సంగీతం:హరి నికేష్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత:విక్రం రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజ్‌కుమార్.జి.ఆర్.