మహేష్‌తో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ కాజల్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అటు గ్లామర్‌తోను, ఇటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈమె లేటెస్టుగా మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇదివరకే మహేష్‌తో రెండు సినిమాలు చేసిన కాజల్‌కు ఇది మూడో సినిమా. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ ఆ తర్వాత తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ‘ఊపిరి’ సక్సెస్‌తో మంచి జోష్‌మీదున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తిచేసుకున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వుంది. పి.వి.పి బ్యానర్‌పై నిర్మితమయ్యే ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వస్తుంది. మహేష్‌తో ఇదివరకే ‘బిజినెస్‌మేన్’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటించిన కాజల్ హ్యాట్రిక్ సినిమాగా చేస్తోంది. మరోవైపు తమిళంలో కూడా వరుస సినిమాలతో అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న కాజల్ హిందీలో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.