నెల్లాళ్లు పులులతో ఉన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని
సరస్వతి పిక్చర్స్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి మన్యంపులి పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించిన జగపతిబాబుతో ఇంటర్వ్యూ..
రెస్పాన్స్ ఎలా వుంది?
తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. కలక్షన్లు బాగున్నాయి. ఈ పాత్రకోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను జగపతిబాబు అని అక్కడ ఎవరికీ తెలియదు. అందరూ ‘డాడి గిరిజ’ అనే పిలుస్తున్నారు. ముఖ్యంగా మోహన్‌లాల్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన ఫెంటాస్టిక్ పర్సన్.
బాగా రిస్క్ తీసుకున్నట్లున్నారు?
ఈ సినిమా భిన్నంగా ఉండడానికి కారణం పులి. సినిమాలో హీరో, విలన్ పులే కావడం విశేషం. పీటర్‌హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలను రియల్‌గా చేయించారు. పులి కూడా రియల్‌గానే చేశారు. నెల రోజులపాటు నేను టైగర్‌తోనే ఉన్నా. ట్రైనింగ్ ఇచ్చిన పులులు వాడారు. వాటికి మూడ్ రావడంకోసం చాలారోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక రకంగా ఈ సినిమాకోసం బాగానే కష్టపడ్డాం.
మలయాళంలో చిన్న బడ్జెట్
సినిమాలే ఎక్కువ కదా?
ఈ చిత్రం మాత్రం అన్ని బౌండరీలను బ్రేక్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా 125 కోట్లు వసూలుచేసి సంచలనం రేపింది. దాంతో సినిమా నిర్మాణంలో కూడా బడ్జెట్ పెరిగింది. మలయాళంలో సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెడతారు. ఆర్టిస్టులకు తక్కువ ఇస్తారు. కానీ సినిమాకోసం ఎంతైనా రిస్క్ చేస్తారు.
యంగ్, సీనియర్ హీరోలతో పని ఎలావుంది?
చాలా బాగుంది. యంగ్‌స్టర్స్‌తో పనిచేయడం వాళ్ల క్యారెక్టర్స్ ఎలా వున్నాయి? ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ల మనస్తత్వాలను స్టడీ చేయడం అంటే ఇష్టం. వాటినుంచి నేను ఎలా ఉండాలనేది నేర్చుకుంటా. అందరితోనూ ఫ్రీగానే వుంటాను. సీనియర్ ఆర్టిస్టులైనా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సమయంలో తారక్ నన్ను అండీ అని పిలిచారు. మీరు కాబట్టి అలా పిలుస్తున్నారు. విలన్ పాత్ర చేసేవాడిని ఎవరూ అండీ అని పిలవరు. బూతులు మాట్లాడతారు. మీరు అండీ అని రెస్పెక్ట్ ఇస్తే ఎంజాయ్ చేస్తున్నా.
విలన్‌గా కొత్త ట్రెండ్ వచ్చిందనుకుంటా?
స్టయిలిష్ విలన్ అనేది బాగా వర్కవుట్ అయ్యింది. గతంలో విలన్ అంటే లావుగా వుండాలి, భయంకరంగా వుండాలి. అనే రాంగ్ ఆలోచనలతో ఉండేవారు. దాన్ని ఛెంజోవర్ చేద్దామనుకున్నప్పుడు నన్ను అలా మారాలన్నారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే సమాజంలో చెడు వాళ్లు కూడా అందంగా ఉండేవాళ్లున్నారు. మంచీ చెడు అనేది మనిషి లోపల ఉంటుంది కానీ బాడీలో కాదుకదా అని చెప్పారు.
మలయాళంలో అవకాశాలు పెరిగాయా?
మోహన్‌లాలే మరో సినిమా చేద్దామన్నారు. తదుపరి చిత్రం ఆయనతోనే వుంటుంది. క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత నాకు ఫ్రీడమ్ పెరిగింది. నాకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను. క్యారక్టర్ ఆర్టిస్టుగా చేయడం తర్వాత పెద్ద పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం దొరికింది. నాకు ఇదో అడ్వాంటేజ్ అయ్యింది. నన్నువాడుకోవడం దర్శకుల బాధ్యత. తెలుగులో హిట్ సినిమాలన్నింటిలో నేను ఉన్నాను. నేను విలన్‌గా చేయడం లేదు. పాత్రలు చేస్తున్నాను.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
సినిమాపై పడిందంటారా?
నాపై ఎలాంటి ప్రభావం లేదు. జనం ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. కొన్నిరోజులైతే అదే సర్దుకుంటుంది. కానీ ఇండస్ట్రీలో చిల్లర ప్రొడ్యూసర్లు పోతారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. భవిష్యత్‌లో ఇండియా బెటర్ కంట్రీ అవుతుంది.
తదుపరి సినిమాలేంటి?
నాగచైతన్య, గోపీచంద్, సాయిధరమ్‌తేజ్‌లతో సినిమాలు చేస్తున్నాను. నేను ప్రధాన పాత్రలో పటేల్‌సార్ సినిమా చేస్తున్నా. వాసు దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు కుమారస్వామి నిర్మాత. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి రివెంజ్ స్టోరీ ఇది. దాంతోపాటు నా బయోగ్రఫీమీద టీవీ సీరిస్ చేయబోతున్నా. అందులో 90 శాతం నిజాలే చెప్పబోతున్నాం. మిగిలిన 10 శాతం కూడా చెబితే అందరి కొంపలు ఆరిపోతాయి.
మీకోసమే స్క్రిప్ట్‌లు రాస్తున్నట్టున్నారు?
అది మంచి విషయమే కదా. హీరోగా ఇబ్బంది పడ్డవన్నీ ఇప్పుడు నా దృష్టిలో పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నాలుగేళ్ల క్రితం నన్ను హీరోగా ఎవరైనా అడుగుతారా అన్న ఫీలింగ్ కలిగింది. డేట్స్ లేవనే పరిస్థితి వస్తుందా అని నవ్వుకునేవాడిని. ఇప్పుడదే జరిగింది. దేనికైనా టైము వస్తుంది. నిరాశపడాల్సిన అవసరం లేదు.

- శ్రీ