16న బాయ్‌ఫ్రెండ్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్, తేజస్వి, రావురమేష్ ప్రధాన తారాగణంగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థనుండి ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన థియేటర్ ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, కొత్త బంగారులోకం సినిమా చూసినప్పుడు నిర్మాత రాజు ఎలా ఆనందించారో అలాగే ఈ సినిమా చూసి అలా భావించారని, అందుకే ఆయన విడుదల చేస్తున్నారని అన్నారు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో యూత్ ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన ఈ సినిమా ఆడియోను ఈనెల 7న విడుదల చేసి, 8న సెన్సార్ కార్యక్రమాలకు పంపుతామని తెలిపారు. ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ చిత్రంలో హెబ్బాపటేల్ గ్లామర్, నటన హైలెట్‌గా ఉంటుందని ఆయన వివరించారు.