మళ్లీ యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ.. శిల్పాశెట్టి గ్లామర్ హీరోయిన్‌గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇక హీరోయిన్‌గా కెరీర్‌లో బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు బిజినెస్‌మన్‌ని వివాహం చేసుకుని బిజీగా మారింది. ఆకట్టుకునే గ్లామకు తోడు యోగాలో ఆమెకు ఆసక్తి ఎక్కువ. ప్రావీణ్యమూ ఉంది. గతంలో యోగా విన్యాసాలు చేస్తూ వీడియోలూ విడుదల చేసింది. సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా.. విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రాచుర్యం తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. శిల్ప యోగ వీడియో అప్పట్లో దుమ్ము రేపింది. దాంతో ఇప్పుడు మళ్ళీ యోగాలోని ఇంకొన్ని అంశాలతో హాట్ వీడియోని రెడీ చేయడానికి సిద్ధం అయిందట. ఇప్పటికే శిల్పా యోగ క్లాస్‌లను నిర్వహిస్తోంది. మరోసారి కొన్ని కొత్త యోగ అంశాలతో ఈ వీడియోను రూపొందిస్తుందట. ఇప్పటికే ఈ విషయంపై ఓ భారీ సంస్థ ఆఫర్ ఇచ్చిందట. సో త్వరలోనే ఈ యోగ వీడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.