అల్లుడు శీను సరసన ప్రగ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’తో బంపర్ హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్ కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసారు. ‘కంచె’ సినిమాతో పరిచయమై హీరోయిన్‌గా పలు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోన్న ప్రగ్యా, ఈ సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపిస్తారు. ద్వారకా క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా బోయపాటి స్టైల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా ప్రచారం పొందుతోంది. సాయిశ్రీనివాస్ చేసిన ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపకపోవడంతో ఈ సినిమాపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.