గల్ఫ్‌లో అరబిక్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు, ఎం.రమణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషాలను దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి వివరించారు. ‘ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు తెలుగులో సినిమా రాలేదు. అనేక యధార్థగాధలను పరిశీలించి, పరిశోధించి ఈ స్క్రిప్టు తయారుచేశాం. ఆర్‌ఎఫ్‌సి, హైదరాబాద్ పరిసరాలు, గల్ఫ్ కంట్రీస్‌లో చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో ఒక అరబిక్ పాటను సందర్భోచితంగా చిత్రీకరించాం. ఇలా ఒక తెలుగు సినిమాలో అరబిక్ పాటను ఉపయోగించుకోవడం ఇదే ప్రథమం. సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి ఇచ్చిన ట్యూన్‌కి కువైట్‌లో పాపులర్ సింగర్ అండ్ రైటర్ అయిన అబ్దులాల్ సాలెమ్ అరబిక్ సాహిత్యం సమకూర్చి, తనే ఆలపించారు. ‘అల్లాయా మహ్లా హవానా’ అనే ఈ అరబిక్ గీతాన్ని కువైట్‌లోని ఫ్రాంకో అరబ్ రికార్డింగ్ స్టూడిలో రికార్డ్ చేశాం.
అరబ్ కంట్రీలో రికార్డైన తొలి తెలుగు సినిమా పాట కూడా ఇదే అవుతుంది. ఈ అరబిక్ గీతాన్ని దిగ్విజయ, ఉస్మాన్, షాన్, 10 మంది డాన్సర్‌లతో చిత్రీకరించాం. గల్ఫ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ ఇమ్రాన్ నృత్య దర్శకత్వం చేశారు. అరబిక్ కల్చర్‌ని, అరబిక్ ట్రెడిషనల్ డాన్స్‌ని ఈ పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం’ అని అన్నారు.
నిర్మాతలు యెక్కలి రవీంద్రబాబు, ఎం.రమణీకుమారి మాట్లాడుతూ- ఇటీవలే ఆర్‌ఎఫ్‌సిలో స్టంట్‌మాస్టర్ డ్రాగన్ ప్రకాశ్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించామని అన్నారు.