30న పిజ్జా 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పిజ్జా-2. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులను, అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలుపుతూ ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ధ్రిల్లర్ జోనర్‌లో సినిమా రూపొందించామని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు థియేటర్ ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, విజయ్ సేతుపతికి ఎనిమిదవ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్‌ప్లేతో, సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకోడి చక్కగా రూపొందించారని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన వివరించారు. గాయత్రి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.