వాస్తవ ఘటనల పిట్టగోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్మోహన్.పి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్.పి నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. దర్శకుడు కమలాకర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయని, వీటిని శ్రీమణి అద్భుతంగా రాశాడని, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారని, ప్రతి ఒక్కరి జీవితానికి చాలా దగ్గరగా వుండే కథ ఇదని అన్నారు. దర్శకుడు అనుదీప్.కె.వి మాట్లాడుతూ ఉయ్యాల జంపాల చిత్రానికి వర్క్ చేశానని, మా టౌన్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌తో ఈ కథను చేశానని, సినిమా బాగా వచ్చిందని అన్నారు. డిసెంబర్ రెండోవారంలో ఈ చిత్రం మ్యూజిక్ ద్వారా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగే నేచురల్ ఇన్సిడెంట్స్‌తో అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం రూపొందించారని అన్నారు.