బాబు.. బాగా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరాల శ్రీనివాస్ కథానాయకుడుగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బాబు.. బాగా బిజీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా హంటర్ చిత్రాన్ని చూసి రూపొందించామని, తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలంటే అవసరాల శ్రీనివాస్ న్యాయం చేస్తాడని అతన్ని ఎంపిక చేశామని తెలిపారు. ఇటీవల కొన్ని సన్నివేశాలను చూసినపుడు తన నిర్ణయం సరైనదని భావించానని, ప్రారంభం నుండి ముగింపువరకు నవ్వించే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. తేజస్వి మడివాడ, సుప్రియా ఐసోలా, శ్రీముఖి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.