ఎన్టీఆర్ కొత్త సినిమా ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై బంపర్‌హిట్ కొట్టిన ‘జనతా గ్యారేజ్’తో ఎన్టీఆర్ మళ్లీ తన కెరీర్‌లో పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ఈ రేంజ్ హిట్ కొట్టాక ఆయన చెయ్యబోయే కొత్త సినిమా ఏమై వుంటుందని అభిమానులంతా ఎదురుచూస్తుండగా, రెండు మూడు నెలలుగా సరైన సమాధానం దొరకలేదు. ఇక ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్న ఎన్టీఆర్, చివరకు దర్శకుడి బాబీకి అవకాశమిచ్చారు. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలను తెరకెక్కించిన బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘ఎన్‌టిఆర్ 27’ సినిమాను నిర్మించనుండడం చాలా సంతోషంగా ఉందని, బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కల్యాణ్‌రామ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఓ కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఆ లుక్ రాగానే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.