రూ.7 కోట్లు ఇస్తేనే నటిస్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు విభిన్నమైన కానె్సప్టులతో యువ హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న ఈమె, రెమ్యూనరేషన్ విషయంలో కూడా సంచలనం రేపుతోంది. సౌత్‌లో ఇప్పటివరకూ ఏ హీరోయిన్ తీసుకోని పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు మూడునుండి నాలుగు కోట్ల వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు వున్న క్రేజ్ అలాంటిది కావడంతో దర్శక నిర్మాతలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఐదు కోట్ల వరకూ వుంటుంది. తాజాగా నయనతార ఒక సినిమాకోసం ఏకంగా 7 కోట్లు డిమాండ్ చేసింది? నిజంగా ఈవిషయం కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా నయన డిమాండ్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే, తాజాగా ఈమెకు లేడీ ఓరియెంటెడ్ సినిమా అవకాశాలు క్యూకట్టాయట. దాంతో ఈ తరహా సినిమాలు చేయాలంటే 7 కోట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే అలాంటి సినిమాలు చేయనని కరాఖండీగా చెబుతోందట. కథ డిమాండ్‌ను బట్టి నయనంతారతో చేయడానికి ఓ నిర్మాత సిద్ధమయ్యాడట. ఒకవేళ ఈ సినిమాగనుక ఓకె అయితే ఇండియాలోనే పారితోషికం విషయంలో నయనతార సంచలనం రేపడం ఖాయం. ప్రస్తుతం ఈ భామ ‘డోరా’, ‘అరమ్’, ‘ఇమైక్కనోడిగల్’ చిత్రాల్లో నటిస్తోంది.