16న చిన్నారి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన కన్నడ చిత్రం ‘మమీ’. తెలుగులో ‘చిన్నారి’ పేరుతో ఈనెల 16న విడుదల కానుంది. గతవారం కన్నడలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్‌గా సాగుతోంది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.రవికుమార్, ఎం.ఎం.ఆర్. నిర్మాతలు. తెలుగు, కన్నడంలో ఏకకాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ’నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. హారర్ జోనర్‌లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తల్లీ కూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవలే కన్నడలో విడుదలై అమితమైన ప్రేక్షాదరణ పొందుతోంది. ఇటీవల విడుదలైన తెలుగు టీజర్ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉందని చాలామంది చెబుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ హారర్ చిత్రంలో చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత వుంటుందని, గోవా నేపథ్యంలో కథ జరుగుతుందని అన్నారు. కన్నడలో గొప్ప విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 16న విడుదల చేస్తామని తెలిపారు.