డ్రగ్స్‌కు బానిసై బయటపడ్డా.. నటుడు భానుచందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యపాత్రల్లో రవికిరణ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఎల్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న స్టూడెంట్ నెంబర్‌వన్ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు భానుచందర్ క్లాప్‌నివ్వగా, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు దేవిప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో భానుచందర్ మాట్లాడుతూ- ఇది తన రియల్ లైఫ్‌కు బాగా దగ్గరైన సినిమా అని, ఈరోజుల్లో యువతను చదుకోమని పంపిస్తే డ్రగ్స్‌కు, చెడు అలవాట్లకు బానిసవుతున్నారని, అలా డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుణ్ణి గురువు ఎలా దార్లో పెట్టాడనే కథాంశంతో రూపొందుతున్న సినిమా అని అన్నారు. తాను కూడా చిన్నప్పుడు డ్రగ్స్‌కు బానిసైనవాడినేనని, ఆ తరువాత నాన్న మార్షల్ ఆర్ట్స్‌లో చేర్పించడంవల్ల వాటికి దూరమయ్యానని, ఈ చిత్రంలో గురువు పాత్రలో కన్పిస్తానని అన్నారు.
దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ- కథకు టైటిల్ సరిపోవడంతో ‘స్టూడెంట్ నెంబర్‌వన్’ అని పెట్టామని, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వుంటుందని, దాంతోపాటు మదర్ సెంటిమెంట్ వుండే సినిమాలో తల్లి పాత్రలో భానుప్రియ నటిస్తోందని, ఈ నెల 28 నుంచి రెగ్యులర్ ప్రారంభిస్తామని అన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేసి జనవరి చివరిలో విడుదల చేయాలనుకుంటున్నామన్నారు.
హీరో కృష్ణచైతన్య మాట్లాడుతూ- తను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని, ఈ సినిమాకు ఆయన టైటిల్ పెట్టడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత కె.ఎల్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ- మంచి సందేశం వున్న సినిమాగా తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తలారి శ్రీనివాస్, ఫైట్స్:నాగరాజు, కెమెరా:శ్రవణ్‌కుమార్, మాటలు:గోపీకిరణ్, నిర్మాత:కె.ఎల్.ఎన్.ప్రసాద్, దర్శకత్వం:రవికిరణ్.