పాటపాడిన యముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం ‘యముడు-3’ (సింగం-3). ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఆదివారం ఆన్‌లైన్‌లో విడుదలకానున్నాయి. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- అభిమానులకు ఓ ప్రత్యేక హీరోగా మారిన సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో రూపొందిన యముడు, సింగం చిత్రాలు ఘనవిజయం
సాధించాయని, వాటికి కొనసాగింపుగా ‘ఎస్-3’ ‘యముడు-3’ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని, ఇప్పటికే విడుదలైన టీజర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలు అందుకొనేలా ఈ సినిమా రూపొందిందని, సూర్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా మరోసారి ఈ చిత్రంలో విజృంభించి నటించారని, అనుష్క నటన, శ్రుతిహాసన్ గ్లామర్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని ఆయన తెలిపారు.