నీతి కోసం పోరాడే కాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ దర్శకుడు బాల తమిళంలో రూపొందించిన ఓ చిత్రం ‘కాళి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బి స్టూడియోస్ పతాకంపై అధర్వ, ఆనంది, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎం.ఆర్. అందిస్తున్నారు. శర్కునమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ- పక్కా పల్లెటూరు చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో నీతికోసం రెండు ఊర్లమధ్య జరిగిన పోరాటం ప్రధానంగా వుంటుందని తెలిపారు. సంక్రాంతి సంబరాలనుండి పల్లెటూరి పాటలు, సరదాలు, సరసాలు అన్నీ ఈ చిత్రంలో వుంటాయని, తొలి సగం కామెడీతో నవ్విస్తే, రెండోసగం సీరియస్‌గా సాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని తెలిపారు. పి.జి.ముత్తయ్య కెమెరా పనితనం, సన్నివేశాలకు తగిన విధంగా సాగుతుందని, తెలుగువారికి నచ్చే కథ, కథనాలతో రూపొందించిన ఈ సినిమా పాటలను, చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. రాజశ్రీ, బోస్ వెంకట్, రవిచంద్రన్, శాంతకుమారి, అనంతన్, కలై, మధురై రమేష్ తదితరులు నటించారు.