ఈ మోసం ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ చట్టసభల్లో కూర్చుని చట్టాలు తయారు చేసే రాజకీయ నాయకులు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తలతో కలసి సామాన్య ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, ప్రజలు తిరగబడితే ఏం జరుగుతుంది అన్న వాస్తవ చిత్రీకరణతో మెసేజ్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగుతుందని, ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సాగుతుందని తెలిపారు. శక్తివేలు వాసు, సముద్రఖని పోటాపోటీగా నటించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయని, పోలీస్ అధికారిగా శక్తివేలువాసు, మానవ హక్కుల చైర్మన్‌గా సముద్రఖని, విలన్‌గా రియాజ్ అద్భుతంగా నటించారని, కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ అండర్ కరంట్‌గా సాగుతూ సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్‌కి మంచి ఆదరణ లభించిందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, కెమెరా: జోన్స్‌ఆనంద్, నిర్మాణం: వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్, దర్శకత్వం: రవి.