కందవాడలో మిసిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కందవాడలో షూటింగ్ జరుగుతోంది. ఆర్‌వైజె శ్రీరాజా దర్శకత్వంలో జి.రమేష్ రూపొందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం దర్శకుడు శ్రీరాజా మాట్లాడుతూ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ ప్రేమకథలో వైవిధ్యమైన కథనం ఉంటుందని, కొత్త నటీనటులు పరిచయవౌతున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందుతోందని తెలిపారు. సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న శ్రీనాథ్ కథానాయకుడుగా పరిచయవౌతున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. టాకీ పార్ట్, పాటలు డిసెంబర్, జనవరి నెలలో చిత్రీకరిస్తామని, ఓ మంచి చిత్రాన్ని అందించాలన్న కృతనిశ్చయంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రమేష్ అన్నారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దూపాటి, ఎడిటింగ్: వేణు, సంగీతం: ఘనశ్యామ్, పాటలు, నిర్మాత: జి.రమేష్, రచన, దర్శకత్వం: ఆర్.వై.జె.శ్రీరాజా.

చిత్రం..శ్రీనాథ్, పల్లవి