సంక్రాంతికి వస్తున్న వెంకట్రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘దాంపత్యం’ సినిమా చేసినప్పటినుండి జయసుధతో మాకు మంచి అనుబంధం వుందని, ఆ నమ్మకంతోనే ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని, నారాయణమూర్తి నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని, మిగతా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ.. మహానటి సావిత్రి తర్వాత తనకు అంత ఇష్టమైన నటి జయసుధేనని, ఆమెతో ఈ సినిమాలో నటిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు అంశం, నగదు లావాదేవీలు వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుందని, దర్శకుడు శ్రీనివాసరావు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. ఈ బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేశానని, చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో చేస్తుండడం ఆనందంగా వుందని అన్నారు. కథకు తగ్గట్టుగా నారాయణమూర్తిని ఎంచుకుని సినిమా చేస్తున్నారని, ఆయనతో నటించడం మరచిపోలేని అనుభూతని, సమాజంలో ఉన్న కీలకమైన అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ఇదని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: సుధాకర్‌రెడ్డి, ఎడిటింగ్: మోహన రామారావు, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు, నిర్మాత: సిహెచ్.పద్మావతి, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.