విజయవాడలోనే ఖైదీ ఆడియో ఫంక్షన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని చివరి పాటను ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యం ఇటీవలే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాల్ని నెలకొల్పింది. మెగా తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటల్ని విజయవాడలో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ప్రముఖ నటుల సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకలు, విజయోత్సవ సభలు హైదరాబాద్‌లో కాకుండా తిరుపతి, విజయవాడ, వైజాగ్, వరంగల్, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఖైదీ నెం.150 చిత్రంలోని పాటల్ని హైదరాబాద్‌లో కాకుండా విజయవాడలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాటలు కూడా తిరుపతిలో విడుదల కానున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు.