ముగింపు దశలో బాహుబలి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అందరి దృష్టి బాహుబలి-2 పైనే వుంది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ఆసక్తితో తెరకెక్కుతున్న రెండో భాగం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజవౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు చాటిన చిత్రం బాహుబలి. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం సంచలన విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీసువద్ద ఘన విజయాన్ని నమోదుచేసుకుంది. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈనెల 27తో పూర్తవుతుందట. గత రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 27తో గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇక దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరోలను సైతం తలదనే్న స్థాయిలో ఈ సినిమాకోసం జనాలు ఎదురుచూస్తున్నట్టు సర్వేలు వెల్లడవుతున్నాయి. షారుఖ్, సల్మాన్, రజనీలాంటి సూపర్ స్టార్‌ల సినిమాల్ని కాదని ప్రేక్షకుల ఆసక్తితో మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు ప్రభాస్. షూటింగ్‌తోపాటు ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో పాటల్ని విడుదల చేసి, ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.