సంక్రాంతికి శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశామని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ పాటలను ఈనెల 18న విడుదల చేస్తున్నామని, తాతా మనవళ్ళ అనుబంధాన్ని చూపే అందమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోందని అన్నారు. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్ని ఆశిస్తారో అలాంటి అన్ని రకాల అంశాలతో రూపొందే చిత్రమిది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని అన్నారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ- అచ్చమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న శతమానం భవతి టైటిల్‌కు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని అన్నారు.