తండ్రి పడే తపనకు అద్దం పట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కీ మీడియా బ్యానర్‌ను ప్రారంభించి పదేళ్ళుగా ఫీల్ గుడ్ చిత్రాల్ని నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిర్మాత బెక్కం వేణుగోపాల్. తాజాగా సినిమా చూసిస్త మావ సినిమాతో సంచలన విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం హెబ్బాపటేల్, రావు రమేష్, అశ్విన్, పార్వతీశం, నోయల్ ముఖ్యపాత్రల్లో భాస్కర్ బండి దర్శకత్వంలో నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 16న విడులవుతున్న సందర్భంగా బెక్కం వేణుగోపాల్ చెప్పిన విశేషాలు..
‘టాటా బిర్ల మధ్యలో లైలా’ సినిమా తరువాత చాలా సినిమాలు చేశాను. కానీ ఓ మోస్తరు విజయాలే దక్కాయి. తాజాగా ‘సినిమా చూపిస్త మావ’తో మంచి విజయాన్ని అందుకున్నాను. ఆ సినిమా తరువాత పెద్ద హీరోతోనే సినిమా చేయాలని అనుకున్న సమయంలో ఈ కథ విన్నాను. ‘కుమారి 21ఎఫ్’ తరువాత హెబ్బాపటేల్ చేయాల్సిన పాత్ర అన్పించి ఆమెకు చెప్పాను. చిన్న సినిమాగా చేద్దామనుకున్న సమయంలో కథ కాంప్రమైజ్ కావద్దని ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె నాయుడుని కలిశాను. ఆయనకు కథ బాగా నచ్చడంతో గ్రాండ్‌గా చేద్దాం, ‘కొత్తబంగారులోకం’ తరహాలో బాగుందని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఈ కథ గురించి దిల్ రాజుకు చెప్పాడు. ఆయన నాకు ఫోన్ చేసి కథ బాగుంది, మీ వెనుక నేను వుంటాను, ప్రొసీడ్ అవ్వండని ధైర్యమిచ్చారు. అలా మొదలైన ఈ సినిమా మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. ప్రతీ ఫ్యామిలీ కోసం తండ్రి పడే తపనేంటో నాకు తెలుసు. ఈ పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించాడు. ఆయన చాలా బిజీగా వున్నా, వెయిట్ చేసి సినిమా చేశాం. హెబ్బా చాలా నేచురల్‌గా నటించింది. నిజంగా ఈ సినిమాకు తనే ఎస్సెట్. దర్శకుడు భాస్కర్ వినాయక్ దగ్గర అసోసియేట్‌గా పనిచేశాడు. కథను అద్భుతంగా తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ సినిమా అందరికీ నచ్చే అన్ని అంశాలతో రూపొందించాం.