విడిపోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమా తారల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవడంలేదు. పెళ్లైన రెండు మూడు ఏళ్లకే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి విడాకుల వరకు దారితీస్తున్నాయి. ఇటీవల తమిళ హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే, పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన గుడంబా శంకర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మీరా జాస్మిన్, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం క్రేజీ హీరోయిన్‌గా సాగిన ఈమె కెరీర్, ఆ తరువాత డీలాపడింది. ఆ సమయంలోనే దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ అనే వ్యక్తిని 2014లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అక్కడ సెటిల్ అయిన ఆమె కాపురంలో కలతలు వచ్చాయని, ఇద్దరిమధ్య విభేదాల తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారట.