చిన్నారిని చూసి ఐదుసార్లు భయపడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలకపాత్రలో లోహిత్ దర్శకత్వంలో కన్నడంలో మమీ పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రాన్ని కెఆర్‌కె ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్ పతాకాలపై కె.రవికుమార్, ఎం.ఎం.ఆర్. ‘చిన్నారి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకాంత్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు లోహిత్ మాట్లాడుతూ- దర్శకుడిగా నా తొలి చిత్రమిది. హారర్ జోనర్‌లో చాలా కొత్తగా ప్రయత్నించామని, తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వున్న ఈ సినిమా తెలుగు, కన్నడంలో రూపొందించామని, ఇటీవలే కన్నడంలో విడుదలై ఘనవిజయం సాధించిందని అన్నారు. తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం వుందన్నారు. నటి ప్రియాంక మాట్లాడుతూ- చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేస్తున్నానని, ఒకరకంగా ఇది తనకు స్పెషల్ మూవీ అని, యూనిట్ అంతా ఎంతో ఎఫర్ట్‌పెట్టి చేసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- ఉపేంద్ర తనకు మంచి మిత్రుడని, ఇద్దరం కలిసి ‘కన్యాదానం’ చిత్రంలో నటించామని, ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోందని, అందుకే తానుకూడా ఈ జోనర్‌లో ఓ సినిమా చేస్తున్నానని అన్నారు. ఈ ట్రైలర్ చాలా బాగుందని, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించారని, 22 ఏళ్ల వయసులో అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడం విశేషమని అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ- నేను చేసిన సినిమాలు కన్నడంలో కంటే తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టాయని, హారర్ సినిమాలను భయపడకుండా చూస్తానని, కానీ ఈ సినిమా చూస్తున్నపుడు ఐదారుసార్లు భయం కలిగిందని అన్నారు. లోహిత్ 20 ఏళ్ళకే సినిమా మొదలుపెట్టాడని, ఇది సాధారణమైన హారర్ సినిమా కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, కె.రవికుమార్, మహేంద్రరెడ్డి పాల్గొన్నారు.