అంజలి అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో కంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులోనే వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఈమె ప్రస్తుతం ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సరసన డిక్టేటర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దాంతోపాటు ఈమెకు తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే మమ్ముట్టి సరసన హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం వచ్చింది. పెరనాబు అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో మమ్ముట్టి సరసన అంజలిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారట. ఇంత మంచి అవకాశం రావడంతో అంజలి కూడా ఓకె చెప్పేసింది. మరో రెండు వారాల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. గ్లామర్‌తోపాటు నటనకు ఆస్కారం వున్న పాత్రల్లో చేసేందుకు రెడీ అంటోంది అంజలి. ఇప్పటికే ఆమె నటించిన రెండు మూడు చిత్రాల్లో విడుదలకు సిద్ధంగా వున్నాయి.